ఎసిడిటి(గ్యాస్) తగ్గటానికి ఇంటి చిట్కాలు

కడుపులో జీర్ణ ఆమ్లాలు హెచ్చు తగ్గుల కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, వికారం, చెడు శ్వాస వంటివి వస్తాయి. ఈ సమస్య అన్ని వయస్సుల వారిని భాదిస్తుంది. ఈ సమస్యను ఇంటిలో ఉండే సులభమైన వస్తువులను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

CLICKHERE : అయొడైజ్డ్ సాల్ట్ మనకు అవసరమా?

తులసి
తులసి ఆకులలో ఉండే లక్షణాలు పొట్ట ఉబ్బరం,గ్యాస్ వికారం వంటి వాటికీ తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని తులసి ఆకులను నమలవచ్చు. అలాగే రెండు కప్పుల నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని త్రాగవచ్చు. 




CLICKHERE : కోడిగుడ్డు వాడేవారికి....ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దాల్చిన చెక్క
దాల్చినచెక్క జీర్ణ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఒక సహజ ఆమ్ల హారిణి గా పనిచేస్తుంది. కడుపులో గ్యాస్ ను తరిమివేయుటానికి సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో అరస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి త్రాగాలి.

CLICKHERE : హేమ రూటే వేరు... కోరిక తీరేనా?

మజ్జిగ
ఎసిడిటి వలన వచ్చే కడుపునొప్పి,గ్యాస్ వంటి వాటిని చాలా సమర్ధవంతంగా తరిమికొట్టే సామర్ధ్యం మజ్జిగకు ఉంది. ఒక స్పూన్ మెంతులను నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేసి గ్లాస్ మజ్జిగలో కలిపి త్రాగాలి. అదనపు రుచి కోసం కొంచెం నల్ల మిరియాల పొడి,కొత్తిమీర కలపవచ్చు.


CLICKHERE : పగిలిన పెదాలు మృదువుగా మారాలంటే....

ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ లో వెనిగర్ లో అల్కలిన్ కడుపులో ఆమ్ల చికిత్సకు సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ లో వెనిగర్ కలిపి త్రాగాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు త్రాగితే మంచి పలితాలు కనపడతాయి.

CLICKHERE : తెల్లజుట్టు నల్లగా మారాలంటే....ఏమి చేయాలో తెలుసా

లవంగాలు
లవంగాలు గ్యాస్ కి కారణం అయిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని తగ్గించటంలో సహాయపడుతుంది. రెండు లవంగాలను మరియు రెండు యాలకులను మెత్తగా చేసి తినాలి. ఈ సమస్యను తగ్గించటమే కాకుండా చెడు శ్వాసను కూడా తగ్గిస్తుంది.

CLICKHERE : చైతు పెళ్లికి మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరు ?

CLICKHERE : మలబద్దకం నుండి ఉపశమనం పొందాలంటే...ఇంటి చిట్కాలు


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top