గాలి జనార్దనరెడ్డి కూతురి పెళ్లి చీర,నగలు ఖరీదు తెలిస్తే దిమ్మ దిరగాల్సిందే..!

కర్నాటక మాజీ మంత్రి బళ్ళారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన రెడ్డి కుమ్మర్తే బ్రాహ్మణి వివాహం హైదరాబాద్ కు చెందిన రాజీవ్ రెడ్డి తో ఈ రోజు బెంగుళూరు ప్యాలెస్ లో అంగరంగ వైభోగంగా జరుగనుంది. వెడ్డింగ్ కార్డుతోనే అందరి దృష్టిని ఆకర్షించిన గాలి, తన కూతురి పెళ్లికి భారీగా ఖర్చుపెడుతున్నారు. దాదాపు 5వందల కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. సినిమా సెట్టింగ్‌లను తలదన్నేలా ఏర్పాట్లు జరిగాయి.


CLICKHERE : జీర్ణ శక్తి పెంచుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు

 గాలి జనార్థనరెడ్డి, శ్రీరాములు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కన్నడ చానల్‌లో ఈ పెళ్లిని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి శుభలేఖతోనే అందరినీ అవాక్కయ్యేలా చేసిన గాలి జనార్థనరెడ్డి కూతురి పెళ్లిలో ప్రతీ ఘట్టాన్ని అత్యంత ఘనంగా చేయాలనుకుంటున్నారట.

CLICKHERE : ఈ నియమాలను..... పాటిస్తే పొట్ట మాయం

గాలి జనార్థనరెడ్డి కూతురు బ్రహ్మణి పెళ్లి పీటలపై కూర్చునే సమయంలో ఆమె కట్టుకునే చీర దగ్గర్నుంచి పెట్టుకునే ఆభరణాల దాకా అన్నీ మామూలు ఖరీదైనవి కావట. ఆమె కట్టుకునే చీర ఖరీదెంతో తెలిస్తే ఎవరికైనా కళ్లు పెద్దవి కావాల్సిందే. ఆ చీర ఖరీదు అక్షరాల రూ.17 కోట్ల రూపాయలట. ఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌తో ఎన్నో రోజులుగా ఈ చీరను తయారుచేయించారట. అంతేకాదు, ఆమె ధరించే నగల ఖరీదు ఇంత వరకూ ఏ వధువు పెట్టుకోలేదేమో. దాదాపు రూ.90 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను ఆమె ధరించనుందట. ఇంకా ఎన్నో సంచలనాలకు గాలి జనార్థనరెడ్డి కూతురి పెళ్లి వేదిక కాబోతోంది.

CLICKHERE : క‌ళ్ళ కొన‌ల వ‌ద్ద పుసి ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

CLICKHERE : భయపెడుతున్న అందాల భామలు ఎవరో తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top