పుష్కరం 12 రోజులు..ఏ రోజు ఏ దానం చేస్తే మంచిది ?

12 రోజుల్లో ఏ రోజున ఏ దానం చేయాలి, వాటి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం.

మొదటి రోజు: బంగారం, వెండి, ధాన్యం, భూమి దానం చేయాలి.
ఫలితం: బంగారం, వెండి దానం చేయడం వల్ల ఇహలోక సుఖభోగాలతో పాటు సూర్యచంద్ర లోకాల ప్రాప్తి కలుగుతుంది. భూదానం వల్ల భూపతిత్వం వస్తుంది. ధాన్య దానం వల్ల కుబేర సంపద కలిగిస్తుంది.


CLICKHERE: ప్రతి రోజు ఉపయోగపడే స్మార్ట్ వంటింటి చిట్కాలు

రెండో రోజు: గోవు, వస్త్రం, రత్నం, లవణ దానాలు చేయాలి.
ఫలితం: గోవు దానం చేయడం వల్ల రుద్రలోక ప్రాప్తి, వస్త్ర దానం వల్ల వసులోక ప్రాప్తి, రత్న దానం వల్ల సార్వభౌమత్వం, లవణ దానం వల్ల శరీర ఆరోగ్యం కలుగుతాయి.

మూడో రోజు: శాఖ, ఫల, గుడాలు (గుగ్గిళ్లు), అశ్వదానాలు చేయాలి.
ఫలితం: కుబేర, అశ్వనీ దేవతాలోక సౌఖ్యాలు అనుభవించి, ఇంద్రసమాన వైభవం పొందుతారు.




CLICKHERE: ఉదయభాను ఈ మధ్య ఎందుకు కనపడటం లేదు?

 నాలుగవ రోజు: పాలు, తేనె, నెయ్యి, నూనె దానం చేయాలి.
ఫలితం: పాలు దానం చేస్తే సిరిసంపదలు కలుగుతాయి. తేనె దానం చేస్తే వైకుంఠ నగర ప్ర వేశం, ఘృత (నెయ్యి) దానం వల్ల ఆయువు వృద్ధి చెందుతుంది. తైల(నూనె) దానం వల్ల నరక నివారణ కలుగుతుంది.

అయిదో రోజు: ధాన్యం, బండి, గేదె, ఎద్దులను దానంగా ఇవ్వాలి.
ఫలితం: ఈ దానాల వల్ల దివ్యమైన భోగభాగ్యాలతో కైలాస నివాసం కలుగుతుంది.


CLICKHERE: రాగి,ఇత్తడి చేసే మేలు మీకు తెలుసా?

ఆరో రోజు: అగరు, కస్తూరి, చందన దానాలు చేయాలి. ఔషధ
దానం అంటే వట్టివేరు, జాజికాయ, జాపత్రి, కరక్కాయ వంటివి దానం చేయాలి.
ఫలితం: ఆరోగ్యం, భాగ్యం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంద్ర, చంద్ర, గంధర్వ లోక నివాసం కలుగుతుంది.

ఏడో రోజు: గృహ, పీఠ, శయ్యా, ఆందోళికా దానాలు చేయాలి.
ఫలితం: చిరకాల సౌఖ్యం, అమరత్వం, మరు జన్మలో ప్రభుత్వ అధికారం లభిస్తాయి.


CLICKHERE : రమ్య కృష్ణ జీవితం గురించి తెలియని షాకింగ్ నిజాలుఎనిమిదో రోజు: గంధ, దారు, పుష్పమాలా దానాలు చేయాలి.
ఫలితం: ఇంద్రలోకంలో దివ్యమైన శుభాలు ప్రాప్తిస్తాయి.

తొమ్మిదో రోజు: పిండదానం, పితృదేవతా ఆరాధనం చేయాలి. దాసీ, శయ్యా, కంబళ దానాలు ఇవ్వాలి.
ఫలితం: పితృదేవతల అనుగ్రహం వల్ల వంశవృద్ధి కలుగుతుంది. స్వర్గ సుఖాలు లభిస్తాయి.


CLICKHERE : రాత్రి పడుకొనే ముందు బ్రష్ చేయటం అవసరమా?

పదో రోజు: శాక, సాలగ్రామ, పుస్తకాలు, వెండి, ముత్యం లోహపు గొలుసులు దానం చేయాలి.
ఫలితం: శాక, సాలగ్రామ దానాల వల్ల భూమండల దాన ఫలం కలుగుతుంది. శాక, పుస్తక, రజిత, మౌక్తి, లోహ దానాల వల్ల అక్షయ పుణ్యలోకాలు కలుగుతాయి.

పదకొండో రోజు: గజ తురగాది దానాలు చేయాలి.
ఫలితం: వైకుంఠ లోక ప్రాప్తి

పన్నెండో రోజు: తిల, అజ (మేక) దానాలు, అలాగే శోడష దానాలు చేయవచ్చు. అంటే ఆవు, బంగారం, వెండి, గేదె, రత్నాలు, పుస్తకాలు, ప్రత్తి, ఏనుగు, గుర్రం, దాసీ, త్రాసు, ఇల్లు, తేనె, మేక, శయ్య, కన్యాదానం చేయాలి.

ఫలితం: ఈ దానాల వల్ల సర్వ ఆపదలు తొలగతాయి. శోడష దానాల వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, రుణ విముక్తి కలుగుతుంది.


CLICKHERE : పవన్, అలీకి తొలి పరిచయం ఎలా జరిగింది?

CLICKHERE : జ్యుస్ త్రాగటం మంచిదా? పండు తినటం మంచిదా?

CLICKHERE : అల్లు అర్జున్ భార్య గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top