Sakshi News home page

హిమబిందు కేసులో మరో ముగ్గురి అరెస్టు

Published Thu, Mar 27 2014 1:36 AM

హిమబిందు కేసులో మరో ముగ్గురి అరెస్టు

పటమట, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచి మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు దారుణహత్య కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు బుధ వారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిం దితులను రెండురోజుల కిందట అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పటమట పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరో ముగ్గురు నిందితుల అరెస్టు విషయాన్ని డీసీపీ రవిప్రకాష్ తెలియజేశారు.

అరెస్టయిన వారిలో నగరానికి చెందిన ఎలక్ట్రిషియన్ జనపాల కృష్ణ(24), మంగళగిరి లో అట్టలు తయారు చేసే కంపెనీలో పనిచేసే పలువూరి దుర్గారావు అలియాస్ కయ్యా(21), చికెన్ షాపులో పనిచేసే రామలింగేశ్వరనగర్‌కు చెందిన లంకపల్లి రమణ(22) ఉన్నారన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..        

సాయిరాం కుటుంబం నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని మరో ఫ్లాట్ యాజమాని వద్ద యనమలకుదురు గ్రామానికి చెందిన మహ్మద్ సుభాని(27) కొంతకాలంగా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని స్నేహితులు పటమటకు చెందిన కారు డ్రైవర్ సోమన గోపీకృష్ణ(24), ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే జనపాల కృష్ణ(24), దుర్గారావు అలియాస్ కయ్యా(21), లంకపల్లి రమణ(22), మరో 35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తితో కలిసి తరచూ సుభాని పని చేసే అ పార్ట్‌మెంట్ వద్దకు వచ్చేవారు. అక్కడ ఉండే షాపుల వద్ద కలుసుకుని మాట్లాడుకునేవారు.

హిమబిందు ఒంటరిగా ఇంట్లో ఉంటుందని సుభాని వారికి తెలిపాడు. ఆమెపై లైంగికదాడి చేయాలని వారంతా నిర్ణయించుకున్నారు. పథ కం అమలులో భాగంగా 15వ తేదీ ఉదయం 11 గంటలకు సుభాని, గోపి, రమణ, కృష్ణ, దుర్గాప్రసాద్, మరో వ్యక్తి మొత్తం ఆరుగురు అపార్ట్‌మెంట్ వద్ద కలుసుకున్నారు. అనంతరం సుభా ని, గోపి, మరో నిందితుడు అపార్ట్‌మెంట్ మూడో ఫ్లోర్‌లోకి వెళ్లి హిమబిందు ఉంటున్న ఫ్లాట్ తలుపులు తట్టారు.

సుభాని తెలిసిన వాడు కావడంతో ఆమె తలుపులు తీసింది. కింది పోర్షన్‌లో నీళ్లు రావడం లేదు, మరమ్మత్తు చే యాలని చెప్పగా, ఆమె అంగీకరించింది. అనంతరం పడకగదిలో నుంచి ఎటాచ్డ్ బాత్‌రూమ్‌లోకి వెళ్లిన నిందితులు ముగ్గురూ పైపులు మరమ్మత్తు చేస్తున్నట్లుగా నటించారు. ఆమె మంచం వద్ద నిలబడి ఆదమరుపుగా ఉండగా అకస్మాత్తుగా దాడి చేశారు. ఒకరి తరువాత ఒకరు లైంగికదాడి చేశారు. తరువాత కింద నుంచి వచ్చిన దుర్గారావు, లంకపల్లి రమణ, జనపాల కృష్ణ కూడా ఆమెపై లైంగికదాడి చేశారు.
 
ఈ విషయం బయట పడుతుందని భావిం చిన నిందితులు ఆమె గొంతు నులిమి హత్య చేశారు. సుభాని పని చేస్తున్న కారు యజమాని కుటుంబం వేరే ఊరు వెళ్లడంతో ఆ ఫ్లాట్ తాళా లు అతడి వద్దే ఉన్నాయి. హిమబిందు మృతదేహాన్ని సుభాని పనిచేసే కారు యజమాని ఫ్లాట్ వంటగదిలోకి  ఈడ్చుకుంటూ వెళ్లారు. తరువాత హిమబిందు ఫ్లాట్‌లోకి వెళ్లి బీరువాలో ఉన్న బం గారు నగలు, వెండి వస్తువులు, నగదు దొం గిలించి పారిపోయారు.

మరుసటి రోజు 16వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత అందరూ కలిసి అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. హిమబిందు మృతదేహాన్ని ఎవరూ చూడకుండా కిందకు దించి, దగ్గరలో ఉన్న బందరు కాలువలో పడేశారు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు మృతురాలి దుస్తులు, చెప్పులు, సెల్‌ఫోన్ తీసుకుని ఆమె మరొకరితో వెళ్లిపోయినటు  ఆధారాలు సృష్టిం చారు.

ఆమె కిడ్నాప్‌నకు గురైనట్లు కూడా డ్రా మా ఆడారు. 17వ తేదీన హిమబిందు మృతదేహం కాలువలో దొరకడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సుభాని తదితరులపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారి కిరాతకం వెలుగులోకి వచ్చిం ది. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు.

నిందితుల నుంచి బంగారు చంద్రహారం, వెంకటేశ్వరస్వామి బం గారు ఉంగరాలు రెండు, ఒక పగడపు ఉంగరం, లాకెట్టు కలిగిన పగడాల బ్రాస్‌లెట్, చిన్నపాటి బంగారు చైన్, వెండి యంత్రం, వెండి పసుపు కుంకుమ సెట్, వెండి కుంకుమ భరిణె, వెండి చెవి రింగులు, వెండి బుట్టలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు నరరూప రాక్షసులని, వారిని కఠినంగా శిక్షించాలని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశంలో సెంట్రల్ ఏసీపీ లావణ్యలక్ష్మి, పటమట సీఐ రవికాంత్, ఎస్సైలు జనార్దన్, లోవరాజు, సిబ్బంది పాల్గొన్నారు.     
 

Advertisement

తప్పక చదవండి

Advertisement